News19th Oct 04:33 PMSunil Byrisetty1 min read
ఎన్నికల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకునేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా, డా. ఏ. మల్లిఖార్జున త
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకునేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా, డా. ఏ. మల్లిఖార్జున తో కలిసి సోమవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, శాంతిభద్రతల ఏడీజీ ఎన్. మధుసూదన రెడ్డి, ఐజీ బి. రాజకుమారి తో సమీక్ష నిర్వహించారు. కొన్ని జిల్లాల్లో తలెత్తిన సమస్యల నేపథ్యంలో రాబోయే ఎన్నికల దశల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని, సున్నిత, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తును పునఃసమీక్షించి, అవసరమైన చోట అదనపు బలగాలను ఏర్పాటు చేస్తామని డీజీపీ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వం వహించకుండా పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేలా జిల్లా అధికారులకు
ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ తెలియజేశారు. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా, ఓటర్లు భయం లేకుండా ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రతా చర్యలు చేపట్టాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.