News8th Jan 03:16 PMSunil Byrisetty1 min read

మడ అడవుల పరిరక్షణకు పటిష్ట చర్యలు

సముద్ర తీర ప్రాంతాల్లో క్షీణిస్తున్న మడ అడవులను పునరుద్ధరించి ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడమే మిస్టీ పథకం ప్రధాన ఉద్దేశ్యం అని నేషనల్ క్యాంపా (CAMPA), చీఫ్ ఎగ

మడ అడవుల పరిరక్షణకు పటిష్ట చర్యలు
సముద్ర తీర ప్రాంతాల్లో క్షీణిస్తున్న మడ అడవులను పునరుద్ధరించి ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడమే మిస్టీ పథకం ప్రధాన ఉద్దేశ్యం అని నేషనల్ క్యాంపా (CAMPA), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆనంద్ మోహన్ తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర అటవీ శాఖల సంయుక్తంగా తీరప్రాంత ఆవాసాలు, స్పష్టమైన ఆదాయాల కోసం మాంగ్రోవ్ ఇనీషియేటివ్ (మిస్టీ - MISHTI)పై విజయవాడ లెమన్ ట్రీ ప్రీమియర్‌ లో గురువారం రెండు రోజులపాటు నిర్వహించే జాతీయ వర్కషాప్‌ ను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన నేషనల్ క్యాంపా(CAMPA), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆనంద్ మోహన్ మాట్లాడుతూ.. సముద్ర తీరప్రాంతాల్లో క్షీణిస్తున్న మడ అడవులను రక్షించి, సముద్రం కోత నుంచి కాపాడటమే లక్ష్యంగా మిస్టీ పథకం పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం ఇది సుమారు రెండున్నర ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ పథకానికి జాతీయ కాంపా (CAMPA) నిధుల నుండి 10% కేటాయిస్తున్నారన్నారు. మొత్తం 825 కోట్ల రూపాయల కేటాయింపుల్లో ఇప్పటివరకు కేవలం 100 కోట్లు మాత్రమే వినియోగించబడ్డాయన్నారు.
Andhra Pradesh
Vijayawada
Mangrove Conservation
MISHTI Scheme
Coastal Protection
CAMPA
National CAMPA
Anand Mohan
Ministry of Environment Forest and Climate Change
MoEFCC
Scroll for the next article