News6th Aug 05:20 PMSunil Byrisetty1 min read

జగన్‌ను కలిసిన విద్యార్థి, నిరుద్యోగ, యువజన జేఏసీ

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్‌ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ విద్యార్థి, నిరుద్యోగ, యువజన జేఏసీ ప్రతినిధులు వైసీపీ అధినేత వైయస్‌ జగన్‌ను కలిశారు. పోలీస్‌ శాఖలో దాదాపు 20

జగన్‌ను కలిసిన విద్యార్థి, నిరుద్యోగ, యువజన జేఏసీ
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్‌ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ విద్యార్థి, నిరుద్యోగ, యువజన జేఏసీ ప్రతినిధులు వైసీపీ అధినేత వైయస్‌ జగన్‌ను కలిశారు. పోలీస్‌ శాఖలో దాదాపు 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిలో కనీసం 10 వేల పోలీస్‌ ఉద్యోగాలైనా వెంటనే భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఏపీఎస్‌యూ జేఏసీ కన్వీనర్‌ ఎంబేటి రామచంద్ర ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు జగన్‌కు వినతిపత్రం అందజేశారు. పోలీస్‌ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల వయోపరిమితిని 35 సంవత్సరాలకు పెంచేలా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయాలని కోరారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత ఎంతోకాలంగా పోలీస్‌ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారని జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగులను గాలికొదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి శిక్షణ తీసుకుంటూ నిరుద్యోగ యువతతో పాటు వారి కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వివరించారు.
Andhra Pradesh
AP Police Jobs
YS Jagan Mohan Reddy
Student JAC
Unemployed Youth
Police Recruitment
నిరుద్యోగం
యువత
ఏపీఎస్‌యూ జేఏసీ
ఉద్యోగాల భర్తీ
ఏపీ వార్తలు
ఉద్యోగ నోటిఫికేషన్
Scroll for the next article