International9th Apr 09:26 AMSunil Byrisetty1 min read
యూఎస్‌లో భారత విద్యార్థులకు కష్టాలే.. OPT రద్దుకు కారణాలు
OPT వల్ల విదేశీ విద్యార్థులు తక్కువ జీతాలకు పనిచేయడానికి సిద్ధంగా ఉండటంతో, అమెరికన్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దక్కడం కష్టమవుతోంది. అందుకే కొందరు అమెరికన్ రాజకీయ నాయకులు OPTని రద్దు
OPT వల్ల విదేశీ విద్యార్థులు తక్కువ జీతాలకు పనిచేయడానికి సిద్ధంగా ఉండటంతో, అమెరికన్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దక్కడం కష్టమవుతోంది.
అందుకే కొందరు అమెరికన్ రాజకీయ నాయకులు OPTని రద్దు చేయాలని కోరుకుంటున్నారు.
OPT, H-1B వీసా పొందడానికి ఒక బ్యాక్ డోర్ లెక్కన మారిందని కొందరు భావిస్తున్నారు.
ఇది H-1B వీసా పరిమితులను ఎస్కేప్ కోసం వాడుతున్నారని వారి అభిప్రాయం.
కొన్ని కంపెనీలు OPT విద్యార్థులను తక్కువ వేతనాలకు నియమించుకోవడం ద్వారా ఖర్చులు తగ్గించుకుంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
అయితే OPT రద్దు భారతీయ విద్యార్థులకు పెను సవాలుగా మారుతుంది.
గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలో పనిచేసే అవకాశం చాలా మంది కోల్పోతారు.
H-1B వీసా పొందడానికి OPT ఒక ముఖ్యమైన మార్గం కాబట్టి, అది రద్దయితే భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది.
అమెరికా అధినేత ట్రంప్ నిర్ణయాలు భారత విద్యార్థుల ఆశలను గల్లంతు చేస్తు్న్నాయి.