News9th Jun 03:27 PMSunil Byrisetty1 min read
గీత గురుకులంలో షైనింగ్ స్టార్స్!
నరసరావుపేటలో జరిగిన షైనింగ్ స్టార్స్ 2025( ప్రతిభ అవార్డులు)కు కేసానుపల్లి గీత గురుకులం హై స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. పురస్కారాలు సాధించిన విద్యార్థులు తిరుమల శెట్టి కోమలి, బ
నరసరావుపేటలో జరిగిన షైనింగ్ స్టార్స్ 2025( ప్రతిభ అవార్డులు)కు కేసానుపల్లి గీత గురుకులం హై స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. పురస్కారాలు సాధించిన విద్యార్థులు తిరుమల శెట్టి కోమలి, బత్తుల అమూల్య, అనంత వైష్ణవిలను నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ, మంత్రి గొట్టిపాటి రవికుమార్ సత్కరించారు. ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఈ సందర్భంగా అతిథులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా షైనింగ్ స్టార్స్ కార్యక్రమాన్ని మంత్రులు, ప్రజాప్రతినిధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో దాచేపల్లి ఎంఈఓ, పినాకిని పాణి, పాఠశాల కరస్పాండెంట్ అనిశెట్టి సాంబశివరావు విద్యార్థులను ప్రశంసించి సన్మానించడం జరిగింది.