News26th Jul 05:50 PMSunil Byrisetty1 min read

విద్యార్థి దశ నుండే దేశభక్తిని పెంపొందించుకోవాలి

విద్యార్థి దశ నుండే దేశభక్తిని పెంపొందించుకోవాలని, కార్గిల్ యుద్ధంలో పని చేసిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్, మానవత శాఖ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ అన్నారు

విద్యార్థి దశ నుండే దేశభక్తిని పెంపొందించుకోవాలి
విద్యార్థి దశ నుండే దేశభక్తిని పెంపొందించుకోవాలని, కార్గిల్ యుద్ధంలో పని చేసిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్, మానవత శాఖ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ అన్నారు. మచిలీపట్నం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం కార్గిల్ దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో సేవలందించిన ఆర్టీసీ డిఎం పెద్దిరాజును ఘనంగా సత్కరించారు. బాబా ప్రసాద్ మాట్లాడుతూ 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో ఎందరో తమ ప్రాణాలను దేశమాత కోసం పణంగా పెట్టారన్నారు. మచిలీపట్నం ఆర్టీసీ డిఎం, మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి పెద్దిరాజులు మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో జరిగిన సంఘటనలను వివరించారు. భారతీయ సైనికులు ఆనాడు వీరోచితంగా పోరాడమన్నారు. మానవతా సంస్థ మచిలీపట్నం అధ్యక్షుడు జి కిషోర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి హాసింబేగ్, జిల్లా కమిటీ కో చైర్మన్ ముదిగొండ శాస్త్రి, ఆదిత్య, వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు.
Andhra Pradesh news
Kargil Vijay diwas
Indian army
Inspiration For Students
Kargil War 1999
డిఎం పెద్దిరాజు
మానవతా సంస్థ
Scroll for the next article