Education23rd Oct 04:55 PMSunil Byrisetty1 min read
పదవ తరగతి ఉర్దూ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ విడుదల
రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూ మీడియంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మైనారిటీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో స్టడీ మెటీరియల్ విడుదల చేశారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీ
రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూ మీడియంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మైనారిటీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో స్టడీ మెటీరియల్ విడుదల చేశారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (సి ఈ డి ఎం ) ఆంధ్రప్రదేశ్ శాఖ రూపొందించిన ఉర్దూ మీడియం పదవ తరగతి స్టడీ మెటీరియల్ ను రాష్ట్ర న్యాయ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆవిష్కరించారు. సిఈడిఎం సంచాలకుడు (ఎఫ్ఏసి), రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వీసీ,ఎండి యాకుబ్ భాష అధ్యక్షతన స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, పదవ తరగతి పాస్ అయితే జీవితం కూడా సగం పాస్ అయినట్లేనని అందువలన ప్రతి ఒక్క విద్యార్థి పదవ తరగతి పాస్ కావాలనే సంకల్పంతో నిష్ణాతులచే స్టడీ మెటీరియల్ రూపొందించడం జరిగిందని అన్నారు. మైనారిటీలకు ఉన్నత విద్యతో పాటు, యు పి ఎస్ సి, ఏపీపీఎస్సీ, టెట్, నీట్,డీఎస్సీ లాంటి ఉద్యోగ పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ తో కూడిన చర్యలను అమలు చేస్తున్నదని అన్నారు. మైనారిటీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా సిఈడిఎం కేంద్రాల ద్వారా మైనారిటీ విద్యార్థులకు ఉచిత విద్య,ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతున్నదని పేర్కొన్నారు. ఉర్దూ విద్యార్థుల కోసం రూపొందించిన స్టడీ మెటీరియల్ ను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న ఉర్దూ పదవ తరగతి విద్యార్థులకు సిఈడియం ద్వారా పంపుతున్నట్లు, అందుకు తగిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని సంచాలకుడు యాకూబ్ భాషను మంత్రి ఫరూక్ ఆదేశించారు.