Education9th Aug 04:00 PMSunil Byrisetty1 min read

పోటీ పరీక్షల అభ్యర్థులకు మెటీరియల్‌

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నిర్వహించే గ్రూప్‌-1, గ్రూప్‌-2తో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత తమ లక్ష్య

పోటీ పరీక్షల అభ్యర్థులకు మెటీరియల్‌
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నిర్వహించే గ్రూప్‌-1, గ్రూప్‌-2తో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత తమ లక్ష్యాలను చేరుకునేలా రూపొందించిన ‘శాస్త్ర సాంకేతిక విజ్ఞానం – పర్యావరణం’ పుస్తకాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోటబొమ్మాళి ఎన్టీఆర్‌ భవన్‌ వద్ద ఆవిష్కరించారు. నేటి పోటీ పరీక్షల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్‌.ఎస్‌. రెడ్డి సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ పుస్తకాన్ని ఆర్‌.ఎస్‌. రెడ్డి ప్రచురణ సంస్థ ప్రచురించింది. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, పర్యావరణ అంశాలపై పోటీ పరీక్షల అభ్యర్థులకు సమగ్ర అవగాహన కల్పించేలా ముఖ్యమైన అంశాలను సులభంగా అర్థమయ్యే రీతిలో ఇందులో పొందుపరిచారు. ప్రభుత్వం నిర్వహించే గ్రూప్‌-1, గ్రూప్‌-2తో పాటు వివిధ పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకునేలా నాణ్యమైన, సమగ్ర స్టడీ మెటీరియల్‌ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
Andhra Pradesh
Government Jobs
APPSC
Group 1
Group 2
Competitive Exams
Study Material
Science and Technology
Environment
Job Aspirants
Unemployed Youth
Achchennaidu
Scroll for the next article