News4th Jan 01:07 PMSunil Byrisetty1 min read
రాంబిల్లి ప్రమాద ఘటనపై నివేదిక అందజేయాలి
రాంబిల్లి మండలం, అచ్యుతాపురం, ఎ పి ఎస్ ఇ జడ్ లో SVS కెమికల్ ఇండస్ట్రీస్ వద్ద అగ్ని ప్రమాద సంఘటన పై రెండు రోజుల్లో పూర్తిస్థాయినివేదిక అందజేయాలని హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్
రాంబిల్లి మండలం, అచ్యుతాపురం, ఎ పి ఎస్ ఇ జడ్ లో SVS కెమికల్ ఇండస్ట్రీస్ వద్ద అగ్ని ప్రమాద సంఘటన పై రెండు రోజుల్లో పూర్తిస్థాయినివేదిక అందజేయాలని హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను అదేశించారు. ఆదివారం ఉదయం
ఎ పి ఎస్ ఇ జడ్ లో ఎస్ వి ఎస్ కెమికల్ ఇండస్ట్రీస్ వద్ద అగ్ని ప్రమాద సంఘటన స్థలాన్ని హోం మంత్రి అనిత, ఎలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయకుమార్ పరిశీలించారు.
హోం మంత్రి అనిత ప్రమాదం ఎలా జరిగిందో కంపెనీ ప్రతినిధులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సంఘటనపై కంపెనీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేసారు.కంపెనీలో పరిమితికి మించి కెమికల్స్ నిల్వ చేయడంపై కంపెనీ ప్రతినిధులను ప్రశ్నిస్తూ, ప్రమాదానికి గల కారణాలపై రెండు రోజుల్లో పూర్తిస్థాయినివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నిన్న దురదృష్టకరమైన సంఘటన జరిగిందని, ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు తక్షణమే స్పందించారని, ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రమాద ఘటన స్థలానికి వెంటనే చేరుకొని మంటలు అదుపు చేయడం జరిగిందన్నారు.