News18th Oct 01:24 PMSunil Byrisetty1 min read
కెఎల్ శాట్ శాటిలైట్ల ప్రయోగం సక్సెస్
కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీ అధ్యాపకులు, విద్యార్దులతో కలిసి రూపొందించిన దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా కెఎల్ యూనివర్శిటీ తలపెట్టిన కెఎల్ జాక్ నింగిలోకి వెళ్లి పరిశోధనలు ప్రారంభించిం
కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీ అధ్యాపకులు, విద్యార్దులతో కలిసి రూపొందించిన దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా కెఎల్ యూనివర్శిటీ తలపెట్టిన కెఎల్ జాక్ నింగిలోకి వెళ్లి పరిశోధనలు ప్రారంభించింది. 1-బెలూన్ సహాయంతో మొదటి కెఎల్ జాక్ శాటిలైట్ ను నింగిలోకి పంపారు. అత్యల్ప బరువు కలిగిన విద్యా శాటిలైట్లలో కేఎల్ జాక్ శాటిలైట్ ఒకటి. శనివారం ఉదయం 5:45 నిముషాలకు కెఎల్ జాక్ శాటిలైట్ ను పీకో బెలూన్ సాయంతో కేంద్ర మంత్రి భూపతి రాజు, వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జి.పార్ధసారథి వర్లు, విద్యార్దులతో కలిసి నింగిలోకి వదిలారు. కెఎల్ జాక్ శాటిలైట్ గాలి నాణ్యతపై పరిశోధన చేయనున్నట్లు రూపకర్త డాక్టర్ కె.సిహెచ్.శ్రీకావ్య తెలిపారు. 2- కెఎల్ శాట్ 2 ను ప్లైట్ మోడ్ డ్రోన్ సహాయంతో కేఎల్ శాట్-2 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. పర్యావరణ సమాచారం సేకరించనున్న కేఎల్ శాట్-2 - వాతావరణ పరిస్థితులు, వాయు నాణ్యతపై అధ్యయనం చేయనునుంది. ఎటిసి గన్నవరం ఎయిర్ ట్రిపక్ క్లియరెన్స్ వచ్చాక 6:45 గంటలకు కెఎల్ శాట్ 2 ను ప్లైట్ మోడ్ డ్రోన్ సాయంతో నింగిలోకి పంపారు. నిర్దేశిత కక్ష్యలోకి వెళ్లిన తరువాత కెఎల్ యు విద్యార్దులు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా శాటిలైట్ 1 గంట పాటు నిర్దేశిత కక్ష్యలో భూమి నుంచి సుమారు 12 కిలోమీటర్ల ఎత్తులో 60 కిలోమీటర్లు సమాంతరంగా ప్రయాణించి పరిశోధనలు చేసి మళ్లి లాంచ్ ప్యాడ్ పైన విజయవంతంగా దిగింది.