News1st Jun 09:07 AMSunil Byrisetty1 min read

ముగిసిన బాస్కెట్ బాల్ వేసవి తరగతులు.

వేసవి కాలాన్ని వృధాగా పోనివ్వకుండా ఏదైనా ఒక క్రీడలో ప్రతిభ కలిగిన వారిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో కృష్ణాజిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత బాస్కెట్ బాల్ శిక్షణ తరగతులను నిర్వహించారు. స

ముగిసిన బాస్కెట్ బాల్ వేసవి తరగతులు.
వేసవి కాలాన్ని వృధాగా పోనివ్వకుండా ఏదైనా ఒక క్రీడలో ప్రతిభ కలిగిన వారిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో కృష్ణాజిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత బాస్కెట్ బాల్ శిక్షణ తరగతులను నిర్వహించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ సహకారంతో కృష్ణాజిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నందు జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు పర్యవేక్షణలో, 45 రోజులపాటు నిర్వహించిన ఉచిత వేసవి బాస్కెట్ బాల్ శిక్షణ తరగతులు విజయవంతంగా ముగిసాయి. ఈ శిక్షణా తరగతులకు మొత్తం 110 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. వారందరికీ హెడ్ కానిస్టేబుల్ సుధీర్ శిక్షణ, ఆటలో మెలకువలు నేర్పించారు. బాస్కెట్ బాల్ శిక్షణా తరగతులకు హాజరైన విద్యార్థులందరికీ జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేసి అభినందనలు తెలియజేశారు. విద్యార్థులందరికీ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్.ఉస్మా కంఠమనేని MD.DVL టీ షర్టులను స్పాన్సర్ చేయగా ఎస్పీ విద్యార్థులకు అందజేయడం జరిగింది. అనంతరం కొద్దిసేపు విద్యార్థులతో ఎస్పీ సరదాగా ముచ్చటించారు.
Andhra Pradesh news
Krishna District
free basketball training
sp.R .Gangadhararao
45 రోజులపాటు ఉచిత వేసవి బాస్కెట్ బాల్ శిక్షణ
డాక్టర్. ఉస్మా కంఠమనేని MD.DVL టీ షర్టులను స్పాన్సర్
Scroll for the next article