News3rd Nov 05:16 PMSunil Byrisetty1 min read
అర్నబ్, మురసు తుఫాన్‌లను ఎదుర్కొన్నాం
మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అర్నబ్, మురసు తుఫాన్లలో ప్రాణనష్టాన్ని నివారించేలా... ఆస్తినష్టాన్ని తగ్గంచేలా పనిచేశామని చెప్పారు. రెస్క్యూ, రిలీఫ్, రిహాబిలిటేషన
మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అర్నబ్, మురసు తుఫాన్లలో ప్రాణనష్టాన్ని నివారించేలా... ఆస్తినష్టాన్ని తగ్గంచేలా పనిచేశామని చెప్పారు. రెస్క్యూ, రిలీఫ్, రిహాబిలిటేషన్ వంటి మూడు అంశాలపై ఎక్కువ దృష్టి సారించామన్నారు. రెండు తుఫాన్ల విషయంలోనూ వాటి గమనాన్ని అంచనా వేస్తూ... గాలుల వేగాన్ని విశ్లేషించుకుంటూ సహయక చర్యల విషయంలో ప్రణాళికాబద్దంగా వ్యవహరించామని తెలిపారు. అర్నబ్, మురసు తుఫాన్ల విషయంలో టాప్ టు బాటమ్ అధికార యంత్రాంగాన్ని కదలించాం.. కో-ఆర్డినేషన్‌తో పనిచేశామన్నారు. ఆర్టీజీఎస్‌తో క్షేత్రస్థాయిలోని వ్యవస్థలకు పక్కా సమాచారాన్ని అందించగలిగామని వివరించారు. అవేర్ ద్వారా అంచనాలను విశ్లేషించుకుని డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోగలిగామని సీఎం వెల్లడించారు.