National15th Dec 12:48 PMSunil Byrisetty1 min read

కేంద్ర సమాచార కమిషనర్ గా సుధారాణి

కేంద్ర సమాచార కమిషనర్ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుధారాణి రేలంగి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె పెట్రోలియం, సహజవాయువుల రెగ్యులేటరీ బోర్డు సభ్యురాలిగా ఉన్న ఆమెను సమాచార కమిషనర్ గా నియ

కేంద్ర సమాచార కమిషనర్ గా సుధారాణి
కేంద్ర సమాచార కమిషనర్ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుధారాణి రేలంగి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె పెట్రోలియం, సహజవాయువుల రెగ్యులేటరీ బోర్డు సభ్యురాలిగా ఉన్న ఆమెను సమాచార కమిషనర్ గా నియమిస్తూ ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని నియామక కమిటీ సిఫార్సు చేసింది. ఏలూరు నగరానికి చెందిన రేలంగి సుధారాణికి అత్యున్నత పదవి దక్కింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎనిమిది మంది కేంద్ర సమాచార కమిషనర్లలో ఆమె ఒకరు. ఏపీ నుంచి నామినేట్‌ అయ్యారు. ఇండియన్‌ లీగల్‌ సర్వీస్‌ అధికారి అయిన ఆమెకు లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌, లెజిస్లెటివ్‌ డ్రాఫ్టింగ్‌, ప్రాసిక్యూషన్‌, ఇంటర్నేషనల్‌ కోఆప రేషన్‌ విభాగంలో 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఇదివరకు సీబీఐలో ప్రాసి క్యూషన్‌ డైరెక్టర్‌గా, కేంద్ర న్యాయశాఖలో జాయింట్‌ సెక్రటరీగా పని చేశారు. ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్సులో జడ్జి అటార్నీ జనరల్‌గా సేవలందించారు.
National News
Central Information Commissioner
Sudharani Relangi
Andhra Pradesh
Government of India
CIC Appointment
Indian Legal Service
Eluru
Public Administration
Legal Expert
Scroll for the next article