News3rd Sep 01:21 PMSunil Byrisetty1 min read

సుగాలి ప్రీతి కేసు మరోసారి సీబీఐకి!

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసు విచారణను మరోసారి సీబీఐకి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సుగాలి ప్రీతి తల్లి తమకు న్యాయం జరగలేదని మాట్లాడటం, వైసీపీ నేతలు

సుగాలి ప్రీతి కేసు మరోసారి సీబీఐకి!
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసు విచారణను మరోసారి సీబీఐకి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సుగాలి ప్రీతి తల్లి తమకు న్యాయం జరగలేదని మాట్లాడటం, వైసీపీ నేతలు పరామర్శించడంతో వాటికి చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసును సీబీఐకి సిఫారసు చేయాలని నిర్ణయించారు. నాలుగో తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని కేంద్ర హోంశాఖకు పంపుతారు. అయితే ఈ కేసును గత వైసీపీ ప్రభుత్వంలోనూ సీబీఐకి అప్పగిస్తూ సిఫారసు చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. అయితే ఇప్పుడు మళ్లీ ఈ అంశాన్ని రాజకీయం చేయాలని వైసీపీ ప్రయత్నిస్తూండటంతో సీబీఐకి ఇవ్వాలని నిర్ణయించారు.
Andhra Pradesh Politics
Sugali Preethi
CBI Investigation
YSRCP
TDP
AP Government
Political Controversy
Justice for Preethi
Cabinet Decision
Crime Investigation
న్యాయం కోసం పోరాటం
క్రైమ్ ఇన్వెస్టిగేషన్
Scroll for the next article