Entertainment18th Sep 12:27 PMSunil Byrisetty1 min read

టాలీవుడ్ ఎంతో ఇచ్చింది.. ఇంత దిగిపోవాలా సుహాస్?

చెన్నైలో జరిగిన “మందాడి” సక్సెస్ మీట్ లో సుహాస్ ప్రవర్తనపై తెలుగు సినిమా ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ మందాడి సినిమా డైరెక్టర్ మాట్లాడుతూ.. “కలర్ తక్కువగా ఉన్నాడని తె

టాలీవుడ్ ఎంతో ఇచ్చింది.. ఇంత దిగిపోవాలా సుహాస్?
చెన్నైలో జరిగిన “మందాడి” సక్సెస్ మీట్ లో సుహాస్ ప్రవర్తనపై తెలుగు సినిమా ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ మందాడి సినిమా డైరెక్టర్ మాట్లాడుతూ.. “కలర్ తక్కువగా ఉన్నాడని తెలుగు ఇండస్ట్రీలో తక్కువ చేసేవారు, కామెంట్లు చేసేవారు, కానీ తమిళనాట మాత్రం సుహాస్ కలర్ అంటే ఇష్టపడతారు. ఇక్కడ స్టార్ యాక్టర్ గా ఎదుగుతాడు” అని కామెంట్ చేశాడు. దానికి స్టేజ్ కింద కూర్చున్న సుహాస్ కూడా అవును అన్నట్లుగా తల ఊపుతూ నవ్వడంపై తెలుగు ఇండస్ట్రీ సీనియర్లు మండిపడుతున్నారు. సుహాస్ షార్ట్ ఫిలిమ్స్ చేసినప్పటినుంచి తెలుగు ఆడియన్స్, ఫిలిం మేకర్స్ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. కలర్ ఫోటోతో హీరో అయి తర్వాత డబ్బుల కోసం పలు సినిమాలు చేసిన సుహాస్ కొన్ని సినిమాల్ని కనీసం ప్రమోట్ కూడా చేయలేదు. అయినా తెలుగు సినిమా అక్కున చేర్చుకుంది. తెలుగులో హీరోగా బోలెడన్ని సినిమాలు చేసి, బాగా డబ్బులు సంపాదించుకున్న సుహాస్, ఇప్పుడు తమిళనాట “తెలుగులో నేను రేసిజం ఫేస్ చేసాను” అంటూ అక్కడి దర్శకనిర్మాతలకు చెప్పుకోవడం చిల్లర తనమనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
Scroll for the next article