International11th Nov 05:10 PMSunil Byrisetty1 min read

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 12 మంది మృతి

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో బాంబు పేలిన తర్వాతి రోజే పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ భారీ పేలుడుతో దద్దరిల్లింది. మంగళవారం నాడు నగరంలోని జ్యుడీషియల్ కాంప్లెక్స్ సమీపంలో జరిగిన శక్తిమంతమ

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 12 మంది మృతి
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో బాంబు పేలిన తర్వాతి రోజే పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ భారీ పేలుడుతో దద్దరిల్లింది. మంగళవారం నాడు నగరంలోని జ్యుడీషియల్ కాంప్లెక్స్ సమీపంలో జరిగిన శక్తిమంతమైన పేలుడులో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు న్యాయవాదులేనని పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇది ఆత్మాహుతి దాడి అని భావిస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కోర్టు గేటు వద్ద పార్క్ చేసి ఉన్న ఓ కారులో ఈ పేలుడు సంభవించింది. ఇది అత్యంత రద్దీగా ఉండే సమయం కావడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, కారులోని గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని భావిస్తున్నా, ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల పార్క్ చేసిన అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. సుమారు 6 కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు తెలిపారు. గత కొంతకాలంగా పాకిస్థాన్ టీటీపీ ఉగ్రవాదుల నుంచి తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్‌లో టీటీపీ కార్యకలాపాలు పెరిగాయి.
Pakistan
Islamabad Blast
Suicide Attack
TTP
Terrorism
Bomb Explosion
Islamabad Judicial Complex
Pakistan News
Taliban
Law and Order
South Asia
Islamabad Incident
Scroll for the next article