Health17th May 04:24 PMSunil Byrisetty1 min read

ఈత పండు పోషక విలువలు మెండు

పొలం గట్ల మీద కనిపించే ఈత పండు మానవ ఆరోగ్యానికి ఎంతో మంచిది. తక్కువ ధరకే దొరికే ఈత పండ్లలో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. ఈత పండ్లలో క్యాల్షియం అధికంగా ఉండడం వల్ల అవి తింటే ఎముకలు

ఈత పండు పోషక విలువలు మెండు
పొలం గట్ల మీద కనిపించే ఈత పండు మానవ ఆరోగ్యానికి ఎంతో మంచిది. తక్కువ ధరకే దొరికే ఈత పండ్లలో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. ఈత పండ్లలో క్యాల్షియం అధికంగా ఉండడం వల్ల అవి తింటే ఎముకలు బలంగా మారతాయి. ఈత పండ్లు అల్జీమర్స్ వ్యాధిని తగ్గిస్తాయి. ఈత పండ్లలో ఉండే గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ లు తక్షణ శక్తిని ఇస్తాయి. అలసటను దూరం చేస్తుంది. ఈత పండ్లు రెగ్యులర్‌గా తింటే జీర్ణశక్తి బాగుండి కడుపు నొప్పి మలబద్దకం వంటి జీర్ణ రుగ్మతలను తగ్గిస్తుంది. ఈత పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉండుట వలన రక్త వృద్ధి జరుగుతుంది. ఎనిమియా తగ్గించును. ఈత పండ్లను తినటం వలన వేడి తగ్గుతుంది. నిస్సత్తువ,అలసట వంటివి తగ్గుతాయి. ఈత పండ్ల వల్ల మన శరీరంలో రోగనిరోధాల శక్తి పెరగటమే కాకుండా శరీరంలో రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది.
Health Benefits
Palm Fruit
iron
blood circulation
ఈత పండు
గ్లూకోజ్
సుక్రోజ్
ఫ్రక్టోజ్
ఈత పండ్లలో క్యాల్షియం
Scroll for the next article