News31st Jan 11:41 AMSunil Byrisetty1 min read

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మహారాష్ట్ర చరిత్రలో తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర నిలవనున్

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మహారాష్ట్ర చరిత్రలో తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర నిలవనున్నారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించడంతో.. సునేత్ర పవార్ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టనున్నారు. NCP అజిత్ వర్గం ప్రతిపాదనను సునేత్ర అంగీకరించారు. నేడు మధ్యాహ్నం NCP శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి సునేత్రను శాసనసభాపక్షనేతగాఎన్నుకోనున్నారు. సాయంత్రం ముంబై లోక్‌భవన్‌లో సునేత్ర ప్రమాణస్వీకారం చేస్తారు. బారామతి ఉపఎన్నికలో సునేత్ర పవార్ పోటీ చేయనున్నారు.
Maharashtra Politics
Sunetra Pawar
Deputy Chief Minister
NCP Ajit Pawar Faction
Maharashtra Government
మహిళా నాయకత్వం
బారామతి ఉపఎన్నిక
ముంబై లోక్ భవన్
Scroll for the next article