News21st Jan 04:20 PMSunil Byrisetty1 min read

వ్యోమగామి సునీతా విలియమ్స్ రిటైర్మెంట్

అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ఒక శకం ముగిసింది. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ తన రిటైర్మెంట్ ప్రకటించారు. 60 ఏళ్ల వయసులో ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్స్ అ

వ్యోమగామి సునీతా విలియమ్స్ రిటైర్మెంట్
అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ఒక శకం ముగిసింది. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ తన రిటైర్మెంట్ ప్రకటించారు. 60 ఏళ్ల వయసులో ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్స్ అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది. అంతరిక్షం నాకు రెండో ఇల్లు వంటిదని.. కానీ ఇప్పుడు కొత్త తరానికి అవకాశం ఇచ్చే సమయం వచ్చిందని ఆమె తన రిటైర్మెంట్ సందర్భంగా పేర్కొన్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఆమె నాసాలో యువ వ్యోమగాములకు మెంటార్‌గా వ్యవహరిస్తూ, భవిష్యత్తు మిషన్లకు తన అనుభవాన్ని అందించనున్నారు. సునీతా విలియమ్స్ తన కెరీర్‌లో ఎన్నో అరుదైన రికార్డులను నెలకొల్పారు. మహిళా వ్యోమగామిగా అత్యధికంగా 9 సార్లు అంతరిక్షంలో నడిచిన రికార్డు ఆమె సొంతం. ఆమె మొత్తం 62 గంటలకు పైగా స్పేస్ వాక్ చేశారు.
Sunita Williams
Astronaut Retirement
NASA
Space Exploration
Indian-Origin Astronaut
Spacewalk Record
Women in Space
Science News
Space History
Mentorship
Scroll for the next article