Politics23rd Oct 03:59 PMSunil Byrisetty1 min read

వివేకా కేసులో హైదరాబాద్ కోర్టులో సునీత పిటిషన్

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరపాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ ఎన్. సునీతారెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీ

వివేకా కేసులో హైదరాబాద్ కోర్టులో సునీత పిటిషన్
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరపాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ ఎన్. సునీతారెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో దర్యాప్తును కేవలం కొందరికే పరిమితం చేస్తే అసలైన సూత్రధారులు తప్పించుకునే ప్రమాదం ఉందని, ఇప్పటికే తండ్రిని కోల్పోయి తీవ్ర వేదనలో ఉన్న తనకు అన్యాయం జరగకూడదని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సాక్షులను ప్రభావితం చేసేందుకు తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయాన్ని స్వయంగా సీబీఐ, ఏపీ పోలీసులే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారని ఆమె గుర్తుచేశారు. ఈ కేసులో ఐదో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి, కడప జైలులో అప్రూవర్‌గా మారిన నాలుగో నిందితుడు దస్తగిరితో భేటీ అయి, ఆయన్ను ప్రలోభపెట్టేందుకు, బెదిరించేందుకు ప్రయత్నించారని సునీత ఆరోపించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆమె కోర్టుకు విన్నవించారు. అంతేకాకుండా, వివేకా వద్ద పీఏగా పనిచేసిన ఎంవీ కృష్ణారెడ్డి, తొలుత ఫిర్యాదు చేసి.. ఆ తర్వాత తనపైన, తన భర్త రాజశేఖర్ రెడ్డిపైన, అప్పటి సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్‌పైన తప్పుడు కేసు పెట్టారని సునీత పేర్కొన్నారు. అయితే ఏపీ పోలీసులే విచారణ జరిపి అది అసత్య కేసని తేల్చి తుది నివేదిక ఇచ్చారని ఆమె తెలిపారు. కేసును లోతుగా దర్యాప్తు చేసి సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసేలా సీబీఐని ఆదేశించాలని ఆమె కోర్టును అభ్యర్థించారు.
Andhra Pradesh Politics
YS Viveka Murder Case
Sunitha Reddy
Hyderabad CBI Court
Deep Investigation
YS Vivekananda Reddy
CBI Inquiry
సప్లిమెంటరీ చార్జ్‌షీట్
న్యాయం కోసం సునీత
వైఎస్ వివేకానందరెడ్డి
Scroll for the next article