Sports6th May 12:56 PMSunil Byrisetty1 min read
ఐపీఎల్‌లో సర్దుకుంటున్న సన్‌రైజర్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్‌లో వర్షం కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) ప్లేఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యాయి. సోమవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్‌లో
వర్షం కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) ప్లేఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యాయి.
సోమవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్
(డీసీ)తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో హైదరాబాద్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను కొనసాగించే అవకాశం లేకపోయింది.
దీంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
ఈ ఫలితంతో 11 మ్యాచ్‌లలో 13 పాయింట్లు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ రేసులో నిలవగా, కేవలం 7 పాయింట్లతో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లను నామమాత్రంగా ఆడనుంది.