Health24th Apr 02:00 PMSunil Byrisetty1 min read

వేసవి ఎఫెక్ట్: వడదెబ్బ కొట్టకుండా ఇలా!

వేసవి మంట పుట్టిస్తోంది. ఇంట్లోంచి అడుగు బయటపెడితే వడదెబ్బ కొడుతుందనే భయమేస్తోంది. ఎండలోకి వెళ్లినప్పుడు తల తిరగడం, వామిట్స్, ఇతర సమస్యలు ఎదురైతే అది వడదెబ్బే అవుతుంది. అందుకే వడదె

వేసవి ఎఫెక్ట్: వడదెబ్బ కొట్టకుండా ఇలా!
వేసవి మంట పుట్టిస్తోంది. ఇంట్లోంచి అడుగు బయటపెడితే వడదెబ్బ కొడుతుందనే భయమేస్తోంది. ఎండలోకి వెళ్లినప్పుడు తల తిరగడం, వామిట్స్, ఇతర సమస్యలు ఎదురైతే అది వడదెబ్బే అవుతుంది. అందుకే వడదెబ్బ తగలకుండా వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య కాలంలో ఎండలో శారీరక శ్రమ ఉన్న పని చేయకపోవడం ఉత్తమం. టోపీ, స్కార్ఫ్, రుమాలు వంటి వాటిని తలకు కట్టుకోవడం మేలు. వైట్ కాటన్ దుస్తులు ధరించాలి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బాలింతలు, చిన్నపిల్లలు, వయో వృద్ధులు బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు.
Sunstroke
recovery tips
వేసవి మంట
వడదెబ్బ
ఎండలో శారీరక శ్రమ
.వైట్ కాటన్ దుస్తులు ధరించాలి
Scroll for the next article