News16th Jul 11:18 AMSunil Byrisetty1 min read
ముంచుకొచ్చిన ఎల్ నినో ఉపద్రవం
ప్రపంచవ్యాప్తంగా ఏర్పడ్డ సూపర్ ఎల్ నినో ఉపద్రవం వల్ల మన రాష్ట్రంలో కూడా వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి డా. నిమ్మల రామానాయుడు చెప్పారు. నదుల్లోకి ఇన్ ఫ్లోలు లేకపోవడం వల్ల న
ప్రపంచవ్యాప్తంగా ఏర్పడ్డ సూపర్ ఎల్ నినో ఉపద్రవం వల్ల మన రాష్ట్రంలో కూడా వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి డా. నిమ్మల రామానాయుడు చెప్పారు. నదుల్లోకి ఇన్ ఫ్లోలు లేకపోవడం వల్ల నీటిమట్టాలు అడుగంటాయన్నారు. గుంటూరు జిల్లా సీతానగరం దగ్గర కృష్ణా పశ్చిమ డెల్టా కాలువకు ఆయన నీటిని విడుదల చేశారు. కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లో నీటి నిల్వలు లేనందున కృష్ణా డెల్టాకు ఇప్పటివరకు చుక్క నీరు రాలేదన్నారు. ఫలితంగా కృష్ణ డెల్టా 13 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి అయోమయంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపు, నీటి యాజమాన్యంలో ఆయనకున్న సమర్థత కారణంగా పులిచింతలలో ఈరోజుకి.. కూడా మనం 30 టిఎంసిల నీరు నిల్వ చేసుకోగలటం గొప్ప విషయం అన్నారు. అలాగే గోదావరి జలాలు పట్టిసీమ ద్వారా 16 టీఎంసీలు వరకు తరలించగలమన్నారు.