Mobiles22nd May 05:24 PMSunil Byrisetty1 min read
వన్‌ప్లస్ ప్రియులకు శుభవార్త.. కొత్త ఫోన్ వివరాలివే..!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 27న వన్‌ప్లస్ ఎస్ సిరీస్‌లో మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేయనుంది. అలాగే, టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌నూ లాంచ్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ గుడ్ న్యూస్ చెప్పింది.
ఈనెల 27న వన్‌ప్లస్ ఎస్ సిరీస్‌లో మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేయనుంది.
అలాగే, టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌నూ లాంచ్ చేయనుంది.
వన్‌ప్లస్ ఏస్ 5 అల్ట్రా ఎడిషన్, వన్‌ప్లస్ ఏస్ 5 రేసింగ్ ఎడిషన్ పేర్లతో రాబోయే ఈ ఫోన్ల ఫీచర్లు, ధర వివరాలు చూద్దాం.
వన్‌ప్లస్ ఏస్ 5 రేసింగ్ ఎడిషన్
ఈ వేరియంట్‌లో ఫోన్ మిడియాటెక్ డైమెన్సిటీ 9400e ప్రాసెసర్‌తో పనిచేయనుంది.
ఇది 6.77 అంగుళాల 1.5K రిజల్యూషన్‌తో కూడిన 120Hz LTPS డిస్‌ప్లేతో రానుంది.
ఈ ఫోన్‌ను రాక్ బ్లాక్, వైట్, విల్డర్నెస్ గ్రీన్ రంగుల్లో విడుదల చేయనున్నారు.
స్టోరేజ్ వేరియంట్ల విషయానికి వస్తే.. 12GB + 256GB, 16GB + 256GB, 12GB + 512GB, 16GB + 512GB లలో అందుబాటులో ఉండనుంది.
డిజైన్ పరంగా ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో రూపొందించబడింది.
దీని వల్ల ఫోన్ తక్కువ బరువుతో ఉండనుందని తెలుస్తోంది.