News16th Oct 05:11 PMSunil Byrisetty1 min read

జీఎస్టీ 2.0 సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే సంస్కరణ

‘దేశంలో పన్నుల భారం పెరగడమే తప్ప ఎప్పుడూ తగ్గిన దాఖలాలు ఉండవు. గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణతో పేదలు, సామాన్యులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంద

జీఎస్టీ 2.0 సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే సంస్కరణ
‘దేశంలో పన్నుల భారం పెరగడమే తప్ప ఎప్పుడూ తగ్గిన దాఖలాలు ఉండవు. గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణతో పేదలు, సామాన్యులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంది. విద్యా, వైద్యం ఖర్చుల భారం నుంచి ప్రజలకు ఊరట లభిస్తుంద’ని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జీఎస్టీ 2.0తో ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 20 వేల వరకు ఆదా అవుతుందన్నారు. ఆత్మ నిర్భర భారత్ ద్వారా ప్రపంచ పటంలో దేశాన్ని నిలబెట్టిన మోదీ కృషితో దేశంలో, రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లు వెల్లువెత్తుతున్నాయన్నారు. గూగుల్ లాంటి అతిపెద్ద ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కి వచ్చాయని తెలిపారు. ఎలాంటి ఫలితం ఆశించకుండా దేశ సేవే పరమావధిగా పని చేస్తున్న కర్మ యోగి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని అభివర్ణించారు. “ధర్మాన్ని పట్టుకుని ముందుకు వెళ్తున్న నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉండడం మన అదృష్టం. మోదీ దేశాన్ని మాత్రమే కాదు.. రెండు తరాలను ముందుకు నడుపుతున్నారు. భావి తరానికి మార్గదర్శనం చేస్తున్నారు. దేశం తలెత్తుకొనేలా ఆత్మ నిర్భర్ భారత్ తీసుకువచ్చారు. మేము సేవకులం మాత్రమే కాదు అవసరం అయితే ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తామని చాటి చెప్పారన్నారు.
Andhra Pradesh
Relief For Common Man
GST 2.0
Pawan Kalyan
Narendra Modi
Aatmanirbhar Bharat
Tax Reforms
India Economy
మోదీ సంస్కరణలు
సుశాసనం
ఆర్థిక అభివృద్ధి
Scroll for the next article