News28th Aug 10:23 AMSunil Byrisetty1 min read
సూపర్ సిక్స్... సూపర్ హిట్...
ఎన్నికలకు ముందు పార్టీ యంత్రాంగం సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన చెప్పిన విధంగా హామీలన
ఎన్నికలకు ముందు పార్టీ యంత్రాంగం సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన
చెప్పిన విధంగా హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. ఇదే విధంగా పింఛన్ల విషయంలో కూడా పార్టీ కేడర్ పని చేయాలన్నారు. రాజకీయాల్లో ప్రజలకోసం పనిచేయడం ఎంత ముఖ్యమో... చేసిన పనిని చెప్పుకోవడం కూడా అంతే ముఖ్యమని గుర్తు చేశారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం విజయవంతం అయ్యిందన్నారు. 1.12 కోట్ల ఇళ్లకు పార్టీ యంత్రాంగం చేరిందని చెప్పారు. ప్రభుత్వం చేసే మంచిని వివరించిందన్నారు. సెప్టెంబర్ 6వ తేదీన అనంతపురంలో సూపర్-6 సూపర్ హిట్ సభ నిర్వహిస్తున్నామని వివరించారు. మేనిఫెస్టోలో చెప్పినదానికంటే ఎక్కువ చేశామని,. ఇచ్చిన మాట ప్రకారం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ నిర్వహించామని వెల్లడించారు. ఎంతమంది పిల్లలున్నా.. తల్లికి వందనం ఇచ్చాం. అన్నక్యాంటీన్, అన్నదాత సుఖీభవ అమలు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణసౌకర్యం కల్పించామన్నారు.