News7th Sep 10:33 AMSunil Byrisetty1 min read
అనంతపురంలో *సూపర్ సిక్స్ సూపర్ హిట్*
ఈ నెల 10న అనంతపురంలో జరగనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో సహచర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, పి.
ఈ నెల 10న అనంతపురంలో జరగనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో సహచర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, పి. నారాయణ, సవితమ్మ, పయ్యావుల కేశవ్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లతో కలిసి సమీక్షించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సభా వేదిక, హెలిపాడ్ ఏర్పాట్లను మంత్రుల బృందం ప్రత్యక్షంగా పరిశీలించింది. సభ విజయవంతం కావడానికి అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, రాకపోకల సౌకర్యాలు, మంచినీటి వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఆదేశించారు.