News11th Jan 03:43 PMSunil Byrisetty1 min read
సూపర్ స్టార్ కృష్ణకు విజయవాడతో ప్రత్యేక అనుబంధం
పద్మభూషణ్, సూపర్ స్టార్ కృష్ణ కి విజయవాడ అంటే కేవలం అభిమానం మాత్రమే కాదని, ఆత్మీయ అనుబంధం వుందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. హైదరాబాద్ పద్మాలయా స్టూడియోలో ఎప్పుడు కలిసి
పద్మభూషణ్, సూపర్ స్టార్ కృష్ణ కి విజయవాడ అంటే కేవలం అభిమానం మాత్రమే కాదని, ఆత్మీయ అనుబంధం వుందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. హైదరాబాద్ పద్మాలయా స్టూడియోలో ఎప్పుడు కలిసినా “విజయవాడ ఎలా ఉంది?” అని ఆప్యాయంగా అడిగే వారని గుర్తు చేశారు. విజయవాడ అంటే సూపర్ స్టార్ కృష్ణ కి ఎంతో ప్రేమ, ప్రత్యేకమైన స్థానం ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
లెనిన్ సెంటర్లో ఆదివారం జరిగిన కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్, వెనిగండ్ల రాము, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నిర్మాత అశ్వనీదత్, హీరో జయకృష్ణ లతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. కృష్ణ ఈనాడు సినిమా షూటింగ్ జరిగిన లెనిన్ సెంటర్‌లో విగ్రహావిష్కరణ జరగటం ఆనందంగా వుందన్నారు. పద్మాలయా సంస్థ అధినేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కృష్ణ మనమడు ఘట్టమనేని జయకృష్ణల చేతుల మీదుగా ‘ఈనాడు’ సినిమాలోని రామరాజు పాత్ర వేషధారణ రూపంలో కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించడం ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. అశ్వినీదత్ – జయకృష్ణ కాంబినేషన్‌లో రాబోయే చిత్రం సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు.