Politics21st May 03:22 PMSunil Byrisetty1 min read
కార్యకర్తల బాధ్యత నాది.. అండగా ఉంటా
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం అని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల బాధ్యత తాను తీసుకుంటానని, ఇంటికి పెద్దకొడుకులా అండగా ఉంటానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నార
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం అని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల బాధ్యత తాను తీసుకుంటానని, ఇంటికి పెద్దకొడుకులా అండగా ఉంటానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
కార్యకర్తల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేస్తున్న మంత్రి నారా లోకేష్.. నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తలతో సమావేశమై వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తున్నారు.
ఇకపై ఉండవల్లి నివాసంలో కార్యకర్తలను నేరుగా కలుసుకుని వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో హత్యకు గురైన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను నివాసానికి పిలిపించుకుని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
అలవాల గ్రామానికి చెందిన వెన్నా బాలకోటిరెడ్డి నాలుగు దశాబ్దాలుగా పార్టీ పటిష్టత, ప్రజా సంక్షేమ కోసం పనిచేశారు.
దీనిని ఓర్వలేని గూండాలు వెన్నా బాలకోటిరెడ్డిని తుపాకీతో కాల్చి చంపారు.
కూటమి ప్రభుత్వంలో కార్యకర్తే అధినేత అనే లక్ష్యంతో పనిచేస్తున్న లోకేష్.. నష్టపోయిన కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా నిలుస్తున్నారు.