News22nd Sep 05:29 PMSunil Byrisetty1 min read
దివ్యాంగులకు చేయూత.. పేదలకు భరోసా
దివ్యాంగుల జీవితాల్లో స్వావలంబనకు బాటలు వేయడంతో పాటు ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి ని
దివ్యాంగుల జీవితాల్లో స్వావలంబనకు బాటలు వేయడంతో పాటు ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మేదరమెట్లలో దివ్యాంగులకు ఉచిత ట్రై స్కూటీలను, లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ చెక్కులను అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబు ఆదేశాలతో pgrs గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రతి మండలంలో నిర్వహిస్తున్నామన్నారు. పీ4 కార్యక్రమం, దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో 31 మంది దివ్యాంగులకు ఉచితంగా ఈ రోజు ట్రై స్కూటీలు పంపిణీ చేశామన్నారు. ఇప్పటివరకు అర్హులైన 202 మంది దివ్యాంగులకు ట్రై స్కూటీలు అందించినట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. సమాజ సేవలో భాగంగా సీఎస్ఆర్ నిధులతో పేదలకు చేయూత ఇచ్చే స్వచ్ఛంద సంస్థలు, దాతలను మంత్రి అభినందించారు.