News3rd Sep 04:23 PMSunil Byrisetty1 min read
స్థానిక సంస్థలకు ఊతమిస్తాం
స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్ధిక సాయంతో పాటు సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం ద్వారా వేగంగా అభివృద్ధి సాధించడంపై అధికారులు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్
స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్ధిక సాయంతో పాటు సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం ద్వారా వేగంగా అభివృద్ధి సాధించడంపై అధికారులు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. వెనకబడిన, తలసరి ఆదాయం తక్కువ ఉన్న స్థానిక సంస్థలను కేటగిరీలుగా విభజించాలని ఆదేశించారు. దీంతో వాటికి ప్రత్యేక సాయం అందించే వీలు కలుగుతుందన్నారు. స్థానిక సంస్థల వర్గీకరణ ప్రక్రియను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. ఇందుకు అవసరమైన చట్టసవరణ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. బుధవారం సచివాలయంలో 5వ రాష్ట్ర ఆర్ధిక సంఘం సభ్యులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్ధిక సంఘం సిఫారుసులను సీఎంకు అందజేశారు. స్థానిక సంస్థల బలోపేతానికి ఆర్ధిక-ఆర్ధికేతర అంశాలపై ఆర్ధిక సంఘం సిఫార్సులు చేసింది.