News21st Oct 08:47 AMSunil Byrisetty1 min read
సీఫుడ్ పరిశ్రమ కు సహకరించండి
సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా (SIA) ప్రతినిధులు, ఆ సంస్థ సీఈవో వెరోనికా పాపకోస్టా, ఎస్ఐఏ ఎంగేజ్ మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్లేలతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా
సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా (SIA) ప్రతినిధులు, ఆ సంస్థ సీఈవో వెరోనికా పాపకోస్టా, ఎస్ఐఏ ఎంగేజ్ మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్లేలతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సిడ్నీలో భేటీ అయ్యారు. సీ ఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా (SIA) సీఈవో వెరోనికా పాపకోస్టా మాట్లాడుతూ... 2017 నుండి ప్రారంభమైన SIA లో ఆస్ట్రేలియాలోని వైల్డ్ క్యాచ్, ఆక్వాకల్చర్, సీఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన 30వేలకు పైగా వ్యాపారులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. తమ సంస్థ ప్రతి ఏటా ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థకు AUD 3.5 బిలియన్ విలువైన వాటాను అందిస్తోందని చెప్పారు. బయో సెక్యూరిటీ, ఎగుమతి పనితీరును మెరుగుపరచేందుకు ప్రభుత్వ, పరిశోధనా సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీలో సీ ఫుడ్ నెట్ వర్కింగ్ కు సహకరించాలని మంత్రి నారా లోకేష్ కోరారు.