News26th Sep 04:16 PMSunil Byrisetty1 min read
ఉత్తరాంధ్ర రైతులను ఆదుకోవాలి
వాయుగుండం ప్రభావంతో వచ్చిన తుఫాన్ ఉత్తరాంధ్ర జిల్లాల రైతాంగానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్ల
వాయుగుండం ప్రభావంతో వచ్చిన తుఫాన్ ఉత్తరాంధ్ర జిల్లాల రైతాంగానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలలో వందలాది గ్రామాలలో వేలాది ఎకరాలలో రైతులు వేసిన వరి, పత్తి, మిర్చి, అరటి, బొప్పాయి వంటి పంటలు చేతికి వచ్చే దశలో నీటిపాలు అయ్యాయి. పేదలు ఉపాధి కోల్పోయారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ఉత్తరాంధ్ర, ఏజెన్సీ ఆదివాసీ రైతులను ఆదుకోవాలని ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పేదలు కోలుకునేదాకా నిత్యావసరాలతో రేషన్, కూలీలకు రూ.10వేలు ఆర్ధిక సహాయం చేయాలని కోరింది. అసలే కరువుతో అల్లాడుతున్న ప్రజలపై మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా తుఫాను వచ్చి పడింది. అందువల్ల యుద్ధ ప్రాతిపదికపై తుఫాను బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు.