National27th Jul 12:54 PMSunil Byrisetty1 min read
మత మార్పిడిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
మత మార్పిడిపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతా
మత మార్పిడిపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు మినహా ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా కోల్పోతారు అని పేర్కొంది. తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతంలోకి వస్తేనే ఎస్సీ హోదా పునరుద్ధరించే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించింది. ఈ అంశంలో ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.