News26th Mar 01:29 PMSunil Byrisetty1 min read

చెట్లను నరకడం కూడా హత్యే

భారీ సంఖ్యలో చెట్లను నరికివేయడం కూడా ఒక మనిషిని హత్య చేయడంతో సమానమైన నేరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా తాజ్ ట్రాపెజియం జోన్ లో ఏకంగా 454 చెట్లను నర

చెట్లను నరకడం కూడా హత్యే
భారీ సంఖ్యలో చెట్లను నరికివేయడం కూడా ఒక మనిషిని హత్య చేయడంతో సమానమైన నేరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా తాజ్ ట్రాపెజియం జోన్ లో ఏకంగా 454 చెట్లను నరికివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మథురకు చెందిన దాల్మియా ఫార్మ్స్ కంపెనీ యాజమాన్యంపై తీవ్రంగా మండిపడింది. కొట్టేసిన చెట్ల స్థానంలో తిరిగి పచ్చదనం నెలకొల్పాలంటే కనీసం వందేళ్లు పడుతుందని పేర్కొంది. పర్యావరణానికి హాని కలిగించే వారి విషయంలో ఎలాంటి జాలి, దయ చూపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. చెట్ల నరికివేతకు పాల్పడిన దాల్మియా ఫార్మ్స్ యజమానికి భారీ మొత్తంలో జరిమానా విధించింది. నరికివేసిన 454 చెట్లకు సంబంధించి ఒక్కో చెట్టుకు రూ. లక్ష చొప్పున ఫైన్ విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతోపాటు తాజ్ ట్రాపెజియం జోన్ సమీపంలో మొక్కల పెంపకం చేపట్టాలని నిందితుడిని ఆదేశించింది. ఈ సందర్భంగా 2019లో ఇచ్చిన ఆదేశాలను కోర్టు గుర్తుచేసింది.
Supreme Court
Cutting down trees
దాల్మియా ఫార్మ్స్ కంపెనీ
Scroll for the next article