News21st Jan 04:13 PMSunil Byrisetty1 min read

లిక్కర్ స్కామ్ నిందితులకు సుప్రీంకోర్టులో షాక్‌!

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారికి సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్ కోర్టు మంజూరు చేసిన డీఫాల్ట్ బెయిల

లిక్కర్ స్కామ్ నిందితులకు సుప్రీంకోర్టులో షాక్‌!
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారికి సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్ కోర్టు మంజూరు చేసిన డీఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం న్యాయస్థానం సమర్థించింది. నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. బెయిల్ కావాలంటే చట్ట ప్రకారం సంబంధిత ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు కేసు విచారణ జరిగింది. లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప తమకు అనుకూలంగా వచ్చిన డీఫాల్ట్ బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునే అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
Andhra Pradesh Liquor Scam
Supreme Court
Default Bail Cancelled
High Court Verdict
CJI Justice Suryakant
Krishna Mohan Reddy
ధనుంజయ రెడ్డి
బాలాజీ గోవిందప్ప
చట్టపరమైన వార్తలు
న్యాయ వ్యవస్థ
Scroll for the next article