News14th Aug 03:58 PMSunil Byrisetty1 min read
ల్యాండ్ పూలింగ్ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు
అమరావతి అసైన్‌మెంట్ భూముల ల్యాండ్ పూలింగ్‌పై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. అసైన
అమరావతి అసైన్‌మెంట్ భూముల ల్యాండ్ పూలింగ్‌పై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. అసైన్‌మెంట్ భూములు స్వాధీనం చేసుకున్న తర్వాత పూలింగ్ చేశారని ఆళ్ల పిటిషన్లో పేర్కొన్నారు. కొందరికి లబ్ధి చేకూర్చేందుకే ప్రణాళిక ప్రకారం కుట్ర పన్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌ను గతంలోనే ఏపీ హైకోర్టు క్వాష్ చేసింది. ఏపీ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించి, ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను డిస్మిస్ సుప్రీంకోర్టు చేసింది.