News20th Aug 05:07 PMSunil Byrisetty1 min read

మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. మార్గదర్శికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో ఉండవల్లి సవాల

మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. మార్గదర్శికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో ఉండవల్లి సవాలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఎస్ఎల్‌పీపై సుప్రీంకోర్టు తుది విచారణ జరిగింది. ఈ కేసును మొదటి నుంచి పరిశీలిస్తే.. మీ వ్యక్తిగత వివాదంగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో మీరు వాదించేకొద్దీ మీపైనే అనుమానాలు పెరుగుతున్నాయని పేర్కొంది. మార్గదర్శి తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనీయర్ న్యాయవాదులు ఇప్పటివరకు రూ.2,500 కోట్లు వెనక్కి ఇచ్చేసినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు... తెలంగాణ హైకోర్టు వ్యవహరించిందన్నారు. వాదనల అనంతరం.. ఉండవల్లి పిటిషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది.
Andhra Pradesh
Margadarsi Case
Margadarsi Financiers
Supreme Court
Undavalli Arun Kumar
Telangana High Court
ఎస్ఎల్‌పీ
ఆంధ్రప్రదేశ్
ఏపీ రాజకీయాలు
న్యాయ వార్తలు
కోర్టు కేసు
మార్గదర్శి వార్తలు
Scroll for the next article