News13th Jan 04:25 PMSunil Byrisetty1 min read
వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు విచారణ
వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా భద్రత, జవాబుదారీతనం, జంతు ప్రేమికుల పాత్రపై సుప్రీంకోర్టు ప్రశ్నలు వేసింది. పిల్లలు, వృద్ధులపై కుక్కల దాడులపై త
వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా భద్రత, జవాబుదారీతనం, జంతు ప్రేమికుల పాత్రపై సుప్రీంకోర్టు ప్రశ్నలు వేసింది. పిల్లలు, వృద్ధులపై కుక్కల దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీధికుక్కలు ప్రాణాలు తీస్తుంటే కళ్లు మూసుకుని కూర్చోవాలా అని ప్రశ్నించింది. కుక్కల బెడదను ఆయా రాష్ట్రాలు అరికట్టాలని స్పష్టం చేసింది. లేకుంటే ఆయా రాష్ట్రాలపై భారీ జరిమానా విధిస్తామని పేర్కొంది. ప్రతి కుక్క కాటుకు ప్రభుత్వాలు పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. జంతు ప్రేమికులు, కుక్కలను పెంచుకుంటున్న వారు వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారిపైనా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కుక్క ప్రేమికులు కేవలం కుక్కల కోసమే స్పందిస్తారా? బాధితుల బాధ, ప్రాణనష్టం గురించి పట్టదా అని నిలదీసింది. కుక్కల కంటే మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వరా అంటూ సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది.