News20th Nov 04:19 PMSunil Byrisetty1 min read

గవర్నర్, రాష్ట్రపతి అధికారాలే "సుప్రీం"

బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి గడువు విధింపుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి, గవర్నర్లకు నిర్ధిష్ట గడువు విధించలేమని సుప్రీంకోర్ట్ తేల్చి చెప్పిం

గవర్నర్, రాష్ట్రపతి అధికారాలే "సుప్రీం"
బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి గడువు విధింపుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి, గవర్నర్లకు నిర్ధిష్ట గడువు విధించలేమని సుప్రీంకోర్ట్ తేల్చి చెప్పింది. గడువు విధించడం అధికారాల విభజనను తుంగలో తొక్కడమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బిల్లుల విషయంలో గవర్నర్‌కు 3 ఎంపికలు మాత్రమే ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. బిల్లు ఆమోదం, అసెంబ్లీకి తిరిగి పంపడం, రాష్ట్రపతికి పంపటమే గవర్నర్‌ ముందు ఉన్న 3 ఎంపికలని పేర్కొంది. అయితే బిల్లులను సుదీర్ఘకాలం పెండిoగ్‌లో పెట్టడం సరికాదని సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ ధర్మాసనం అభిప్రాయపడింది. పున:పరిశీలనకు పంపకుండా నిలిపివేయడం సమాఖ్యవాదాన్ని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు తెలిపింది.
India Judiciary
Supreme Court
Governor Powers
President Powers
Bill Approval
Constitutional Law
Federalism
Pending Bills
SC Judgment
సుప్రీంకోర్టు
గవర్నర్ అధికారాలు
రాష్ట్రపతి అధికారాలు
బిల్లుల ఆమోదం
Scroll for the next article