Politics15th Jun 11:28 AMSunil Byrisetty1 min read
కొమ్మినేనికి బెయిల్.. ఆయనే కీలకం!
సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో బెయిల్ లభించిన విషయం తెలిసిందే. సాక్షి ఛానల్‌లో అమరావతి మహిళలను కించపరిచేలా నిర్వహించిన చర్చా కార్యక్రమంపై నమోదైన కేసుల
సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో బెయిల్ లభించిన విషయం తెలిసిందే. సాక్షి ఛానల్‌లో అమరావతి మహిళలను కించపరిచేలా నిర్వహించిన చర్చా కార్యక్రమంపై నమోదైన కేసులో అరెస్టయిన ఆయనను తక్షణమే విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని గట్టిగా హెచ్చరించింది. కొమ్మినేని శ్రీనివాసరావు ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ఉన్నారు. అయితే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. తర్వాత పదోన్నతిపై సుప్రీంకోర్టు జడ్జిగా కొనసాగుతున్నారు. ఈయన గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సాధారణంగా న్యాయమూర్తులు ప్రధాని, ముఖ్యమంత్రులను వ్యక్తిగతంగా కలవకూడదు. కానీ మిశ్రా గతంలో పార్లమెంటులో, మీటింగులో జగన్‌ను కలిసి నమస్కారం చేసి వచ్చారని ప్రచారం చేస్తున్నారు. ఇంక కొమ్మినేనికి బెయిల్ రావడంలో ఆశ్చర్యం ఏముంటుందంటూ పోస్టులు పెడుతున్నారు.