News13th Jul 11:55 AMSunil Byrisetty1 min read

పోలవరం-బనకచర్ల అనుసంధానంపై సుప్రీంకోర్టులో విచారణ

పోలవరం ప్రాజెక్టు, గోదావరి నీటి వినియోగం, పోలవరం-బనకచర్ల అనుసంధానంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం విచారణ

పోలవరం-బనకచర్ల అనుసంధానంపై సుప్రీంకోర్టులో విచారణ
పోలవరం ప్రాజెక్టు, గోదావరి నీటి వినియోగం, పోలవరం-బనకచర్ల అనుసంధానంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం విచారణ చేపట్టారు. ఇంజక్షన్ ఉత్తర్వులు ఇస్తూ ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలన్న తెలంగాణ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రధాన పిటిషన్‌లో లోపాలు ఉన్నాయని, లోపాలు సరిదిద్దే వరకు విచారణ చేపట్టడం కుదరదని జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం పేర్కొంది. పిటిషన్‌పై విచారణ జరపకుండా నోటీసులు కూడా ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో గోదావరి ప్రాజెక్టులపై సందిగ్ధత మరికొంత కాలం కొనసాగనుంది.
Telangana Government
Andhra Pradesh Government
Polavaram Project
Banakacherla Link
Supreme Court
Godavari Water
Justice Vikram Nath
అంతర్రాష్ట్ర జల వివాదం
పోలవరం
గోదావరి ప్రాజెక్టులు
ఏపీ-తెలంగాణ వివాదం
జలవనరులు
Scroll for the next article