National2nd Sep 03:58 PMSunil Byrisetty1 min read

చెట్లు నరికితే.. లక్ష ఫైన్..

పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు చేసింది. చెట్లను నరకడం పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొంది. ‘దీనివల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని.. వర్షాలు

చెట్లు నరికితే.. లక్ష ఫైన్..
పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు చేసింది. చెట్లను నరకడం పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొంది. ‘దీనివల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని.. వర్షాలు సరిగ్గా పడవు. వాయు కాలుష్యం పెరుగుతుంది. ప్రజలు అనారోగ్యం పాలవుతారు. అందుకే చెట్లను నరకడం నేరం. ప్రతి ఒక్కరికీ పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. చెట్లను నాటి.. వాటిని సంరక్షించాలి. పర్యావరణాన్ని కాపాడితే మన భవిష్యత్తును మనం కాపాడుకున్నట్లేన’ని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. చెట్లు నరకడం మనిషిని చంపడం కంటే దారుణమని, పర్యావరణానికి నష్టం కలిగించే వారిపై దయ చూపలేమని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అక్రమంగా చెట్లు నరికితే ఒక్కోదానికి రూ. 1 లక్ష జరిమానా విధించాలని స్పష్టం చేసింది.
India news
Supreme Court
Environment Protection
Tree Cutting Fine
Climate Change
Air Pollution
ప్రజా ఆరోగ్యం
వృక్ష సంరక్షణ
అటవీ పరిరక్షణ
Scroll for the next article