News19th Dec 11:33 AMSunil Byrisetty1 min read

మహిళా రిజర్వేషన్లపై సుప్రీం కీలక ఆదేశం

మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బార్ కౌన్సిళ్లలో మహిళా న్యాయవాదులకు 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు నోటిఫికేషన్లో

మహిళా రిజర్వేషన్లపై సుప్రీం కీలక ఆదేశం
మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బార్ కౌన్సిళ్లలో మహిళా న్యాయవాదులకు 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టంగా పొందుపరచాలని ఆదేశించింది. గతంలో తామిచ్చిన ఉత్తర్వులను ఈ మేరకు సవరించింది. దేశవ్యాప్తంగా అన్ని బార్ కౌన్సిళ్లలోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ న్యాయవాది ఎంజీ యోగ మాయ గత ఏడాది ఆగస్టు 26న, తర్వాత ఇతరులు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్(సివిల్) దాఖలు చేశారు. వాటిపై సుదీర్ఘ వాదనల అనంతరం ఈ నెల 8న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కృష్ణకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీతో కూడిన ధర్మాసనం తుదితీర్పు వెలువరించింది.
Indian Courts
Supreme Court Order
Women Reservation
Bar Council of India
Women Advocates
Legal News
న్యాయవ్యవస్థ
లింగ సమానత్వం
రాజ్యాంగ హక్కులు
Scroll for the next article