Politics21st Oct 01:25 PMSunil Byrisetty1 min read

మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అవకతవకలు, హింసపై సుప్రీం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. హింస జరిగిన 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పెంచాలని సు

మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అవకతవకలు, హింసపై సుప్రీం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. హింస జరిగిన 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పెంచాలని సుప్రీం ఆదేశించింది. వైయస్ఆర్సీపీ అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల గడువుపై ఈరోజే నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం, జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు నామినేషన్ తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈనెల 25 వరకు అభ్యర్ధుల తుది జాబితా ప్రకటించొద్దని ఆదేశించింది. అలాగే విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక్క పోలీస్ కంప్లైంట్ కూడా రాలేదని ప్రభుత్వం చెబుతుందంటే.. ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మాకు అర్దం అవుతోందంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. హింస జరుగుతుంటే. లా అండ్ ఆర్డర్ లేకపోతే.. నామినేషన్లు వేయడానికి ఎవరు వస్తారని సుప్రీంకోర్ట్ ప్రశ్నించింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు అవకాశం ఉండాలని సుప్రీం పేర్కొంది.
Scroll for the next article