News12th Apr 01:22 PMSunil Byrisetty1 min read
సుప్రీం సర్వోన్నతం.. రాష్ట్రపతి నిర్ణయాలపైనా కీలక వ్యాఖ్యలు
గవర్నర్లు పరిశీలన కోసం రాష్ట్రపతికి పంపే బిల్లులపై నిర్ణయం 3 నెలల్లోగా తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇలా రాష్ట్రపతి విధులపై ఈతరహా తీర్పు చెప్పడం
గవర్నర్లు పరిశీలన కోసం రాష్ట్రపతికి పంపే బిల్లులపై నిర్ణయం 3 నెలల్లోగా తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఇలా రాష్ట్రపతి విధులపై ఈతరహా తీర్పు చెప్పడం ఇదే తొలిసారి.
తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు వెలువరించింది.
ఒకవేళ మంత్రి మండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావించిన పక్షంలో మూడు నెలల్లోగా అలాంటి బిల్లును శాసనసభకు తిరిగి పంపాలని సూచించింది.
గవర్నర్ ఈ కాల నిర్దేశాన్ని పాటించని పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయసమీక్ష జరపవచ్చని వెల్లడించింది.
గవర్నర్‌కు విచక్షణాధికారాలేవీ లేవని, రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోందని తెలిపింది.