National22nd Aug 12:09 PMSunil Byrisetty1 min read
వీధి కుక్కలపై సుప్రీం తీర్పు సవరణ
వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు కీలక సవరణ చేసింది. వీధి కుక్కల బెడదపై ఈ నెల 11న ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. నగరం నంచి వీధి శునకాలను షెల్టర్లకు తరలించే నిర్ణయంలో
వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు కీలక సవరణ చేసింది. వీధి కుక్కల బెడదపై ఈ నెల 11న ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. నగరం నంచి వీధి శునకాలను షెల్టర్లకు తరలించే నిర్ణయంలో మార్పు చేసింది. కేవలం రేబిస్ ఉన్న వాటిని షెల్టర్లకు తరలించాలని ఉత్తర్వులిచ్చింది. వీధి కుక్కలకు ఆహారం ఇచ్చేందుకు కొన్ని ప్రాంతాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వాటికి బహిరంగంగా ఆహారం పెట్టవద్దని ఆదేశించింది. అలాగే వీధి కుక్కలకు స్టెరిలైజ్ చేయాలని సూచించింది.