News2nd Aug 04:51 PMSunil Byrisetty1 min read
స్టేషన్లలో సీసీటీవీలు ఉండాల్సిందే!
దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, దర్యాప్తు సంస్థలలో ఆడియో, వీడియో రికార్డింగ్ సదుపాయం గల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం తప్పనిసరని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలీస్ స్టేషన్లలో వి
దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, దర్యాప్తు సంస్థలలో ఆడియో, వీడియో రికార్డింగ్ సదుపాయం గల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం తప్పనిసరని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలీస్ స్టేషన్లలో విచారణ గదులు, లాకప్‌లు, ఇతర ముఖ్య ప్రాంతాలన్నీ సీసీటీవీల నిఘాలో ఉండాలని స్పష్టం చేసింది.పోలీస్ కస్టడీలో హింసను నిరోధించడానికి, మానవ హక్కుల ఉల్లంఘనల నుండి పౌరులను రక్షించడానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 భరోసా ఇస్తోందని న్యాయస్థానం పేర్కొంది. ఈ నిరంతర సీసీటీవీ నిఘా వల్ల పోలీసుల విచారణ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం పెరగడంతో పాటు నిష్పక్షపాతమైన దర్యాప్తునకు వీలవుతుందని కోర్టు అభిప్రాయపడింది. పౌరుల ప్రాణాలకు, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పించేలా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.