News17th Dec 05:50 PMSunil Byrisetty1 min read

ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాలుష్యం తగ్గించేందుకు ఆచరణాత్మక పరిష్కారం ఆలోచిద్దామని పేర్కొంది. ఢిల్లీలో కాలుష్యం తగ్గించేందుకు భవన నిర్మాణాలపై ఆం

ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాలుష్యం తగ్గించేందుకు ఆచరణాత్మక పరిష్కారం ఆలోచిద్దామని పేర్కొంది. ఢిల్లీలో కాలుష్యం తగ్గించేందుకు భవన నిర్మాణాలపై ఆంక్షలు విధించారని. భవన నిర్మాణాలపై ఆంక్షల వల్ల కార్మికులు ఉపాధి కోల్పోయారని అభిప్రాయపడింది. అందువల్ల భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో నగదు జమ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. భవన నిర్మాణ కార్మికులకు ఇతర ఉపాధి చూపించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఢిల్లీలో మొత్తం 2.5 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, 7 వేల మంది బ్యాంకు ఖాతాలే లభించాయని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది.
Delhi Air Pollution
Supreme Court of India
Construction Workers
Pollution Control Measures
Delhi Government
Environmental Issues
నగదు సహాయం
ఢిల్లీ ప్రభుత్వం
ఉపాధి కల్పన
పర్యావరణ సమస్యలు
Scroll for the next article