National22nd Sep 05:00 PMSunil Byrisetty1 min read
వందేమాతరంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
వందేమాతరం గీతాలాపనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్ని చరణాలు పాడాలన్నది పౌరుల వ్యక్తిగత నిర్ణయమని వ్యాఖ్యానించింది. ఆరు చరణాల ఆలాపనను తప్పనిసరి చేయడంపై ప్రముఖ సంగీత విద్
వందేమాతరం గీతాలాపనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్ని చరణాలు పాడాలన్నది పౌరుల వ్యక్తిగత నిర్ణయమని వ్యాఖ్యానించింది. ఆరు చరణాల ఆలాపనను తప్పనిసరి చేయడంపై ప్రముఖ సంగీత విద్వాంసుడు టి.ఎం. కృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. అన్ని చరణాలు పాడని వారిపై శిక్షాత్మక చర్యలు తీసుకోలేరని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. కేంద్రం విధించే శిక్షాత్మక చర్యల అంశాన్ని పరిశీలిస్తామని వ్యాఖ్యానించింది. వందేమాతరం సవరణ చట్టం, మార్గదర్శకాలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. పౌరుల మత విశ్వాసాలకు రాజ్యాంగ రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొనడంపై పిటిషనర్ తరఫు న్యాయవాది మురళీధర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కోర్టుల్లో చట్టప్రకారమే విచారణ జరుగుతుందన్న సీజేఐ ధర్మాసనం ఉగ్రవాదులుగా ఆరోపణలు ఉన్నవారిపైనా అలాగే విచారణ జరుగుతుందని వ్యాఖ్యానించింది.